Covid-19: దేశంలో తగ్గిన కోవిడ్ కేసులు ఎన్ని అంటే?

Covid-19

Covid-19: దేశంలో తగ్గిన కోవిడ్ కేసులు ఎన్ని అంటే?

Covid-19: భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారంతో పోల్చుకుంటే పాజిటివ్ కేసులు తగ్గాయి. నిన్న (ఆదివారం) 5,874 కరోనా కేసులు నమోదు కాగా, 25 మరణాలు సంభవించాయి. సోమవారం 4282 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీలక(యాక్టివ్) కేసుల సంఖ్య 1750 తగ్గి 47246కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

గత 24 గంటల్లో కరోనా బారిన పడి 14 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,282 పాజిటివ్ కేసులు బయట పడ్డాయి.

ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,70,878 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,547 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 0.11 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. సోమవారం దినసరి పాజిటివ్ రేటు 4.92 శాతంగా నమోదయింది. వారాంత పాజిటివిటీ రేటు 4.00 దిశాతంగా ఉంది.

గత 24 గంటల్లో కేరళలో ఆరుగురు మృతి చెందగా, 14 మంది మృతి చెందారు. ఢిల్లీలో ముగ్గురు, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,31,547కి చేరింది.

ఏప్రిల్ 30న భారత్లో కొత్తగా 5,874 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 29న దేశంలో కొత్తగా 7,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 28 న, భారతదేశంలో 7,533 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లను ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెబ్సైట్ తెలిపింది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh