కాంగ్రెస్ కామారెడ్డి బీసీ మహా గర్జన సభ వాయిదా.. కారణం ఇదే!

కాంగ్రెస్ కార్యకర్తలకు బిగ్ అలర్ట్. ఈ నెల 15న కామారెడ్డిలో జరగాల్సిన బీసీ మహా గర్జన సభను వాయిదా వేసినట్లు పీసీసీ ప్రకటించింది. భారీ వర్ష సూచనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే వివరాలను త్వరలోనే తెలియజేస్తామని పీసీసీ స్పష్టం చేసింది.

రేపు, ఎల్లుండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే సభను వాయిదా వేసినట్లు తెలిపింది.

అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% కోటా బిల్లులు ఆమోదం పొందిన తరుణంలో, ఈ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తదితరులను ఆహ్వానించారు. అలాగే, పీసీసీ చీఫ్‌గా ఏడాది పదవీకాలాన్ని పూర్తి చేసిన మహేశ్ కుమార్ గౌడ్‌కు అభినందన కార్యక్రమం కూడా ప్లాన్ చేశారు. అయితే, వర్ష సూచనల కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.

Leave a Reply