రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రస్తుతం ఎంతంటే?

దేశంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వాణిజ్య LPG సిలిండర్ ధరలు మళ్లీ తగ్గాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.33.50 తగ్గింపు ప్రకటించాయి. అయితే 14.2 కిలోల గృహ ఉపయోగానికి వాడే LPG సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో ఇంటి వినియోగదారులకు ఇప్పటికీ ఉపశమనం దక్కలేదు.

తాజా ధరల ప్రకారం:

ఢిల్లీ: రూ.1,631.50

కోల్‌కతా: రూ.1,735.50

ముంబై: రూ.1,583.00

చెన్నై: రూ.1,790.00

హైదరాబాద్: రూ.1,886.50

వాణిజ్య LPG ధరలు తగ్గడం ఇది వరుసగా రెండో నెల. జూలైలో ఢిల్లీలో ధర రూ.1,665 కాగా, కోల్‌కతా, ముంబైలలో రూ.1,616.50గా ఉండింది. తాజాగా ఇది మరింత తగ్గింది.

ఇంతకీ గృహ LPG సిలిండర్ ధరల పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల గృహ సిలిండర్ ధర రూ.853గా ఉండగా, ముంబైలో రూ.852.50గా ఉంది. వాణిజ్య ధరల ఈ సవరణ ఆగస్టు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

ఈ తగ్గుదలతో హోటల్స్, రెస్టారెంట్లు, టీ స్టాల్స్, చిన్న స్థాయి వ్యాపారులకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది. అయితే ఏప్రిల్‌ నుంచి గృహ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగకపోవడం గమనార్హం.

గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆ ప్రభావమే ఇప్పుడు వాణిజ్య LPG ధరలపై కనిపిస్తోంది. ఈ ధరల మార్పులు ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లో చమురు రేట్లు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు దేశీయ వినియోగదారులకు లాభం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Leave a Reply