CM Jagan’s special focus on these three..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్
చంద్రబాబు, ఆయన తనయుడు, పవన్‌కళ్యాణ్.. కుప్పం, మంగళగిరి, పిఠాపురం.. ఈ మూడు స్థానాలు.. ఆ ముగ్గురు నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్. మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న వైసీపీ అధినేత.. ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను స్పెషల్‌గా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా.. కాకినాడ సభలో పిఠాపురం అభ్యర్థి వంగా గీతను హీరోగా పరిచయం చేశారు సీఎం జగన్. లోకల్ హీరో కావాలా.. సినిమా హీరో కావాలా.. అంటూ పవన్‌ను సైతం టార్గెట్ చేయడం ఆసక్తిగా మారింది.
ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుతోంది. ప్రధాన పార్టీల నేతలందరూ ఎవరికివారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ మేమంతా సిద్ధం అంటూ 20రోజులుగా బస్సుయాత్రతో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా.. కుప్పం, మంగళగిరి, పిఠాపురం అసెంబ్లీ స్థానాలపై స్పెషల్ ఫోకస్తోపాటు స్పెషల్ ప్రమోషన్ కూడా చేస్తున్నారు సీఎం జగన్.
ఇక.. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో.. అక్కడి వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే.. వంగా గీత గెలుపు బాధ్యతలు రీజనల్ ఇన్ఛార్జ్ మిథున్‌రెడ్డి, కాపునేత ముద్రగడ పద్మానాభానికి అప్పగించారు. ఈ లెక్కన పిఠాపురంలో వైసీపీ గెలిచి తీరాలన్న లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక.. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా.. కాకినాడలో పర్యటించిన సీఎం జగన్.. పిఠాపురం గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు. కాకినాడ సభలో పవన్‌కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే.. అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో వంగా గీతను కార్యకర్తలకు స్పెషల్‌గా పరిచయం చేశారు సీఎం జగన్. వంగా గీతను లోకల్ హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. పవన్‌కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే.. గెలిచినంత సేపు మాత్రమే ఇక్కడ ఉంటారని.. కానీ.. లోకల్‌గా ఉండే వంగ గీతను గెలిపించుకుంటే నియోజకవర్గానికి మంచి జరుగుతుందన్నారు. పవన్‌కల్యాణ్‌కి జ్వరం వచ్చినా హైదరాబాద్ వెళ్తారని చేశారు. అందుకే.. లోకల్ హీరో కావాలో.. సినిమా హీరో కావాలో ఆలోచించి ఓటు వేయాలన్నారు సీఎం జగన్.
For More Information Click here

