రూ.500 కే 66 గజాల స్థలం | చౌటుప్పల్‌ | Telangana News

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన రాంబ్రహ్మం తన 66 గజాల స్థలాన్ని విక్రయించేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. ఆయన స్థలం, రేకుల గదితో సహా, సుమారు రూ.16 లక్షల విలువ చేస్తుందని. గత ఏడాదిలో సాధారణ మార్గాల ద్వారా స్థలాన్ని విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం తో, కొత్త ఇంటి కోసం నవంబర్‌లో డబ్బు చెల్లించాల్సి ఉండటంతో, ఈ సారి స్థలాన్నిఎలాగైనా అమ్మడం కోసం రాంబ్రహ్మం ఈ క్రియేటివ్ ఐడియాను ఆలోచించారు.

దాని కోసం రాంబ్రహ్మం రూ.500 విలువైన కూపన్లను ముద్రించారు. మొత్తం 3,000 కూపన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూపన్ కొనుగోలు చేసినవారు తమ పూర్తి వివరాలను నమోదు చేసి, డబ్బాలో వేయాల్సి ఉంటుంది. లక్కీ డ్రా నవంబర్ 2న నిర్వహిస్తాను అని పేర్కొన్నాడు. ఈ డ్రాలో విజేతకు రూ.500 కూపన్‌తో రూ.16 లక్షల విలువైన స్థలం లభిస్తుంది.

స్థానికులు ఈ వినూత్న పద్ధతిని ఆసక్తిగా చూస్తున్నారు. కేవలం రూ.500 ఖర్చుతో రూ.16 లక్షల విలువైన ఆస్తిని సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో, కూపన్ల కొనుగోలు కోసం స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా కూపన్లు అమ్ముడైనట్లు సమాచారం. తెలంగాణలో లక్కీ డ్రా విధానాలపై నిర్దిష్ట ఆంక్షలు ఉన్నందున. ఇలాంటి కార్యక్రమాలపై పోలీస్ మరియు ఇతర అధికార వర్గాల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది.

Leave a Reply