చికెన్ అంటే ప్రాణం పెట్టే వారికి ఇది పండగే. రోజూ ఫ్రై, కర్రీ, గ్రిల్డ్.. ఏ ఫార్మ్‌లో అయినా చికెన్‌ను ఎంజాయ్ చేసే ఫుడ్ లవర్స్‌కి ఇప్పుడు రిలీఫ్ అందించిందీ తాజా ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ కేసులు లేవని స్పష్టం చేసింది. ఇది వినగానే నాన్‌వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. గత కొన్ని వారాలుగా కోళ్ల మరణాలతో తీవ్ర కలకలం ఏర్పడగా, చికెన్ తినడంపై ప్రజల్లో భయం నెలకొంది. అయితే ఇప్పుడు ఆ భయం క్రమంగా తొలిగే పరిస్థితి వచ్చింది.
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టీ. దామోదర నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల ఏపీలోని పలు ప్రాంతాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో బర్డ్ ఫ్లూ అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్‌కు శాంపిల్స్ పంపించి టెస్టింగ్ చేయించారు. టెస్టింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఏపీలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లేదని తేలింది. స్పష్టంగా చెప్పాలంటే.. చికెన్ తినటంలో ఇక ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా ముఖ్యంగా, పల్నాడు జిల్లా లో చోటు చేసుకున్న చిన్నారి మృతి తర్వాత ఆ ప్రాంతంలోని 70 మందికి వైరస్ టెస్టులు చేయగా, అందరూ నెగిటివ్‌గా తేలినట్టు చెప్పారు అధికారులు. దీని వలన బర్డ్ ఫ్లూ భయం కేవలం అపోహ మాత్రమే అని అర్థమవుతోంది.
చాలా మంది రోజూ బిర్యానీ లేకుండా లంచ్ కంప్లీట్ అవ్వదు. అలాంటి వాళ్లకు గత కొన్ని రోజులుగా చికెన్ అంటేనే భయం పట్టుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో ఆ టెన్షన్ పూర్తిగా తగ్గిపోయింది. చికెన్‌లో ఉన్న హై ప్రొటీన్, తక్కువ కొలెస్ట్రాల్ వలన ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా, టేస్ట్ పరంగా కూడా ఫేవరేట్ ఐటెం.
ఇక మళ్లీ దర్జాగా మీ ఫేవరెట్ చికెన్ వంటకాలను ఇంట్లోనో, హోటల్స్‌లోనో ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ తింటే ఏదైనా జరిగిపోతుందనే అపోహను వదిలేసి, దర్జాగా తినవచ్చు! మీరు ప్లేట్‌లోకి చూసే ప్రతి ముక్క ఇప్పుడు భయమయినది కాదు… ఫుల్ రుచికరమైనదే!