చెన్నై రైలులో 80 ఏళ్ల వృద్ధుడి ఆత్మగౌరవం.. స్వీట్లు అమ్ముతూ జీవన పోరాటం

చెన్నైలో ఒక లోకల్ రైలు ప్రయాణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రైలు లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్రయాణీకుడు 80 ఏళ్ల వయసున్న వృద్ధుడు చేతిలో కాగితంలో ప్యాక్ చేసిన స్వీట్లు అమ్ముతున్న దృశ్యాన్ని గమనించాడు. ఆ ప్రయాణికుడు వృద్ధుడితో మాట్లాడడం ద్వారా, ఆయన జీవిత పోరాటం వెనుక కథ వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబర్ 9న @GanKanchi అనే X యూజర్ ఈ కథను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ 1.3 మిలియన్ల మందికి పైగా చూసారు, మరియు వేలాది మంది షేర్ చేసి వృద్ధుడికి అండగా నిలవాలని కోరుతున్నారు. ఈ కథలో వృద్ధుడి జీవితంలోని కష్టాలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి.

ప్రస్తుతం, అతని కుమార్తె లండన్‌లో నివసిస్తోంది, అందువల్ల వృద్ధుడు, 70 ఏళ్ల భార్య ఇద్దరూ స్వతంత్రంగా జీవించేందుకు కష్టపడుతున్నారు. భార్య ఇంట్లో స్వీట్లు తయారు చేస్తుంది, వృద్ధుడు వాటిని రైలులో అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ప్రయాణీకులు స్వీట్లు కొనడం మాత్రమే కాకుండా, వృద్ధుడి ధైర్యం, ఆత్మగౌరవం, జీవిత పోరాటాన్ని గౌరవించమని ప్రోత్సహిస్తున్నారు. చెన్నైలో స్వీట్లు ఆర్డర్ చేయాలనుకునే వారు ప్రత్యక్షంగా సంప్రదించి సహాయం చేయవచ్చని సూచిస్తున్నారు.

నెటిజన్లు కుమార్తెపై కేసు నమోదు చేయాలంటూ, వృద్ధుడికి మరింత సహాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు. వృద్ధుల జీవితం మనకు ఒక గుణపాఠంగా నిలుస్తుందని, పిల్లల బాధ్యత పెద్దలకు సాయపడటం అని కొంతమంది పేర్కొంటున్నారు.

ఈ వృద్ధుడి కథ మనందరికీ పెద్దల ఆత్మగౌరవాన్ని గౌరవించడం, సహాయం చేయడం అవసరమని గుర్తు చేస్తుంది.

Leave a Reply