రాజధాని అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆయన భవనం అంతా పరిశీలించిన తరువాత, కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఇతర ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు మరియు అధికారులు పాల్గొన్నారు.