సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. అయితే దానికి ఒక రోజు ముందు, అంటే సెప్టెంబర్ 6న ప్రమాదకరమైన గ్రహణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. రాహువు చంద్రునితో కలిసి కుంభరాశిలో ఉండటంతో ఈ యోగం ఏర్పడుతుంది.
చంద్రగ్రహణం వివరాలు
చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి, చంద్రుని కాంతిని అడ్డుకోవడంతో చంద్రుడు పూర్తిగా చీకటిగా కనిపిస్తాడు. దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఇండియన్ టైమ్ ప్రకారం ఈ అరుదైన చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. సుమారు 100 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన చంద్రగ్రహణం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గ్రహణ యోగం ప్రభావం
సెప్టెంబర్ 6న ఏర్పడే గ్రహణ యోగం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుందని చెబుతున్నారు. ఆ రాశులు ఇవి:
మిథున రాశి
చంద్రుడు-రాహువు కలయిక వల్ల ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్య రాశి
సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి
ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, అగ్రిమెంట్లు చేయరాదు. గొడవలు తప్పించుకోవాలి. ఆర్థిక, సంబంధిత నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.
ఇక సింహ రాశి వారికి కూడా కెరీర్, డబ్బు, సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.