ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్ ను సైకో అనడంతో పాటు చిరంజీవి పేరును ప్రస్తావించడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే సీఎం జగన్ వచ్చి సినీ ప్రముఖులను కలిశాడంటూ కామినేని శ్రీనివాస్ చెప్పిన విషయాలను అసెంబ్లీలో బాలకృష్ణ ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, ‘చిరంజీవి గట్టిగా అడిగితే ఆ సమయంలో సీఎం వచ్చాడు అన్నది అబద్ధం’ అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తాను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశానని, తన పేరు ప్రస్తావనకు వచ్చినందున ప్రజలకు వివరణ ఇస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తన వద్దకు వచ్చారని తెలిపారు.
సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంపై సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు తనను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు తనను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీఆర్, డీవీవీ దానయ్య, మైత్రి మూవీస్ నిర్మాతలు ఉన్నారని చెప్పారు. వారి సూచనల మేరకు అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్‌లో మాట్లాడానన్నారు.
తరువాత మంత్రి ఫోన్ చేసి, సీఎంను కలుసుకోవడానికి ఒక తేదీ ఇచ్చారని వివరించారు. సీఎం ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లి, లంచ్ సమయంలోనే సినీ పరిశ్రమ సమస్యలను వివరించానన్నారు. ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ ఉందని, సమయం ఇచ్చే ఉంటే అందరం కలిసి వస్తామని తెలిపారని తెలిపారు. కోవిడ్ రెండో దశ నేపథ్యంలో ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పినప్పుడు, పది మందిమీ వస్తామని చర్చించి, బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించానన్నారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో, కొంతమందితో ఫ్లైట్ ఏర్పాటు చేసి సీఎంను కలిసారు.
సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం కోరినందుకు, ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచడానికి అంగీకరించింది. ఆ నిర్ణయంతోనే కొన్ని సినిమాల టికెట్ రేట్లు పెరిగి, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందని చిరంజీవి చెప్పారు. తన సహజ సిద్ధమైన, గౌరవపూర్వక ధోరణిలో తాను మీడియా, సామాన్యులతో మాట్లాడుతానని, దేశంలో లేని కారణంతో పత్రికా ప్రకటన ద్వారా వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నానన్నారు.
ఈ ప్రకటనతో ఇప్పుడు చిరంజీవి vs బాలకృష్ణ వివాదం మరింత క్రిష్టల్ అయింది. వైసీపీ ఫ్యాన్స్ చిరంజీవి ప్రకటనను వైరల్ చేస్తూ, ఆ రోజు జరిగిన సంఘటనను కామెంట్లలో షేర్ చేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా ఇప్పటికే బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పుడు ఈ వివాదం ఇంకా తీవ్రం అవుతుందా? లేదా సమసిపోతుందా? అన్న అంశంపై ఏపీ పాలిటిక్స్‌లో చర్చలు వేగంగా జరుగుతున్నాయి.