Badrinath: తెరచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారలు

Badrinath

తెరచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారలు

Badrinath: ఎప్పుడెప్పుడు బద్రినాథుని ఆలయ తలుపులు తెరచుకుంటాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భక్తులకు నేటితో తెరపడింది.ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్ర స్మరణతో ప్రముఖ బద్రీనాథ్‌ క్షేత్రం మార్మోగింది. గురువారం వేద, వాయిద్యాల నడుమ భక్తుల కోసం బద్రినాథుడు ఆలయ తలపులు ఈ రోజు ఉదయం 7:10 గంటలకు తెరవబడ్డాయి.  గత  సారి మాదిరిగానే ఈసారి కూడా బద్రీనాథ్ ద్వారం తెరిచే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద దేవుడి తొలి హారతి నిర్వహించారు.  అయితే స్వామివారిని దర్శించుకునేందుకు ఒకరోజు ముందుగానే అంటే బుధవారం నుంచే వేలాది సంఖ్యలో భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు.  భక్తులందరిలో చాలా ఉత్సాహం కనిపించింది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ చాలా సంతోషించారు. బద్రీనాథ్ ధామ్ ఆలయం మొత్తం 15 క్వింటాళ్ల పూలతో అలంకరించబడింది.

హిందూ పురాణాల ప్రకారం, బద్రీనాథ్ ఆలయంలో మానవులు వేసవి కాలం నుంచి ఆరు నెలల పాటు శ్రీహరిని పూజిస్తారు. ఆ తర్వాత శీతాకాలం నుంచి ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని చాలా మంది నమ్ముతారు. దేవతలకు ప్రతినిధిగా నారదముని పూజిస్తారు. ఆలయ తలుపులు మూసి ఉన్నప్పుడు నారదుడు అఖండ జ్యోతిని వెలిగిస్తుంటారు.

Badrinath ఆలయ తలుపులు తెరచినప్పుడు అక్కడ వెలిగించే అఖండ జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో అతీంద్రియ కాంతిని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈ అఖండ జ్యోతిని, అతీంద్రియ వెలుగును చూసిన వారికి పాపం నుంచి విముక్తి లభించి మోక్షంలో భాగమవుతారని నమ్ముతారు.

Badrinath ఆలయ తలుపులు తెరచినప్పుడు యోగ బద్రిపై అమర్చిన నెయ్యి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ ఉండే బద్రీనాథ్ విగ్రహాన్ని ఎవ్వరూ ముట్టుకోకూడదనే నియమం ఉంది. ఈ ఆలయంలో విష్ణువుతో పాటు నారాయణుడి రూపాన్ని పూజిస్తారు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు నారాయణుడి రూపంలో తపస్సు చేశారు. అందుకే ఆలయ గర్భగుడిలో శ్రీహరి సహిత నారాయణుడి విగ్రహం ధ్యానంలో ఉంటుంది. ఇక్కడి భగవంతుని విగ్రహం సాలిగ్రామ్ రాతితో తయారు చేయబడింది. ఇది ఒక మీటర్ ఎత్తులో ఉంటుంది. బద్రీనాథ్ ధామ్‌లో ఉన్న సాలిగ్రామ్ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారని నమ్ముతారు.

అయితే ఈ పుణ్యక్షేత్రాన్ని ఒకసారి సందర్శించి, దర్శనం పొందిన వ్యక్తి, తల్లి గర్భంలోకి ప్రవేశించినట్లు అని మళ్ళీ జన్మ ఉండదని.. ముక్తి లభిస్తుందని బద్రీనాథ్ భగవంతునిపై ఒక నమ్మకం. అదే సమయంలో బద్రీనాథ్‌లో మంచు కురుస్తూ వర్షం కురుస్తోంది. అయినప్పటికీ భక్తుల ఉత్సాహంలో ఏమాత్రం తగ్గడం లేదు.

ఛోటీ చార్ ధామ్ యాత్రగా పిలువబడే ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర అక్షయ తృతీయ నుండి ప్రారంభమైంది. చార్ ధామ్‌లో, గంగోత్రి, యమునోత్రి తలుపులు మొదట 22 ఏప్రిల్ 2023న తెరవబడ్డాయి, అదే విధంగా కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఇటీవల 25 ఏప్రిల్ 2023న పూర్తి సాంప్రదాయాలతో తెరవబడ్డాయి.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh