AP Govt : ఏపీ సర్కార్ కొత్త చట్టం.. తప్పుడు సోషల్ మీడియా పోస్టులకు జైలు శిక్ష!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణ కోసం ప్రత్యేక మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, పార్థసారధి, అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.

ఈ ఉపసంఘం కొత్త చట్టాల రూపకల్పనపై చర్చించనుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం ఉండాలని నిర్ణయించారు. అలాగే, సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ లింక్ తప్పనిసరి చేసే అంశంపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పనిసరి అవుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం చేసే విషప్రచారాన్ని ఇక సహించం” అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఎరువులకు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, వైసీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇకనుంచి ఇలాంటి తప్పుడు ప్రచారాలపై కఠినంగా ప్రతిస్పందించాలని సీఎం హెచ్చరించారు.

Leave a Reply