ఏపీ ప్రజలకు మల్టీప్లెక్స్, మాల్స్ పార్కింగ్ ఛార్జీల విషయంలో గుడ్ న్యూస్. మల్టీప్లెక్స్ లేదా మాల్స్‌కి వెళ్లినప్పుడు షాపింగ్ లేదా సినిమా టికెట్ కంటే ఎక్కువగా పార్కింగ్ ఛార్జీలే జేబులు ఖాళీ చేస్తుంటాయి. వినియోగదారుల ఫిర్యాదులు, కోర్టు తీర్పులు వచ్చినా పార్కింగ్ ఫీజుల ఇబ్బంది ఎక్కడా తగ్గలేదు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఏపీ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్, మాల్స్ పార్కింగ్ ల్లో తొలి 30 నిమిషాల పాటు ఉచిత పార్కింగ్ అందుబాటులో ఉండనుంది. అంటే, వాహనదారులు అర్ధగంట వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, 30 నిమిషాల తర్వాత మాత్రం కొన్ని షరతులతో పార్కింగ్ ఫీజు విధించేందుకు అనుమతినిచ్చారు.
మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి వచ్చిన వారు తమ సినిమా టికెట్ చూపిస్తే ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదు.
మాల్స్‌లో షాపింగ్ చేసిన వారు బిల్ చూపిస్తే పార్కింగ్ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.
మాల్స్‌లో కేవలం టైమ్ పాస్ చేసేందుకు వచ్చిన వారు 30 నిమిషాల తర్వాత ఉంటే మాత్రం వారికి పార్కింగ్ ఫీజు వర్తిస్తారు.
అయితే, ఈ నిర్ణయంతో మల్టీప్లెక్స్ లేదా మాల్స్ ప్రస్తుతం ఎంత పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయో, అదే కొనసాగనుంది.
కొత్త పార్కింగ్ రూల్స్ వచ్చే నెల 1వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి.
ఈ నిర్ణయంతో ఏపీ రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌కి వెళ్లే వినియోగదారులకు పార్కింగ్ ఛార్జీల భారం కొంత తగ్గినట్లయింది. ముఖ్యంగా సినిమాకు వెళ్లే ప్రేక్షకులు, షాపింగ్ చేసే కస్టమర్లకు ఇది పెద్ద ఊరట.