AP Govt: రాఖీ కానుకగా.. మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

రాఖీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు బంపర్ గిఫ్ట్ అందించింది. రాఖీ రోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఆ కార్యక్రమాన్ని రాఖీ రోజుతో పాటుగా ఈ నెల 15 నుంచి అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మంత్రి పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అదే రోజున స్వాతంత్ర దినోత్సవం ఉండడంతో బిజీ షెడ్యూల్ ఉన్నా.. సమయం కేటాయించుకుని ఫ్రీ బస్ ప్రారంభ కార్యక్రమానికి రావాలని స్పష్టం చేశారు.

ఫ్రీ బస్ సేవలను అమలు చేసేముందే ఆటో డైవర్లను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. దీనిపై సీఎం కూడా అంగీకారం వ్యక్తం చేస్తూ అధికారులను వెంటనే ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.

అంతేగాక, ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన సింగపూర్ పర్యటన వివరాలను మంత్రులకు వివరించారు. అక్కడి హౌసింగ్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి అంశాలపై చర్చలు జరిగినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రవర్తన కారణంగా సింగపూర్ సంస్థలు ఏపీకి రావడానికి జంకుతున్నాయని సీఎం ఆరోపించారు.

కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీకి కూడా ఆమోదం లభించింది. కల్లు గీత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన దుకాణాల్లో బినామీలకు అవకాశం ఇవ్వబోమని, సరైన స్థాయిలో పర్యవేక్షణ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply