Andhra Pradesh: మే నెలలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

Andhra Pradesh

Andhra Pradesh: ఆంద్రప్రదేశ్ వాసులకు అలర్ట్ .. మే నెలలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

Andhra Pradesh: ఏపీ ప్రజలకు  అలర్ట్  అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక.   గత వారం వరకు రికార్డు స్థాయి ఉష్ణోగత్రలు ఇప్పుడు వర్షాలు ప్రభావం చూపిస్తున్నాయి. నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో మే నెలలో ఉష్ణోగ్రతలు మంట పుట్టిస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు సూచనలు చేసింది.

ఏపీలో ప్రస్తుతం వీస్తున్న తీవ్ర వడగాడ్పులు కోస్తాలో వచ్చే నెలలో కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. మే నెలకు సంబంధించిన బులెటిన్‌ను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు, వడగాడ్పులు వీస్తాయని ఈ నెల ఒకటో తేదీనే ఐఎండీ అంచనా వేసింది.
దీనికి అనుగుణంగా ఈ నెల 10 నుంచి 23 వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాడ్పులు ప్రభావం చూపాయి. అదే తీవ్రత వచ్చే నెలలో కొనసాగుతుందని, ప్రత్యేకించి తూర్పు, ఈశాన్య భారతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తాజా బులెటిన్‌లో పేర్కొంది.

Also View

AP: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో

 

ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమయిన వాడగాలూలు

Andhra Pradesh లో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్లూరిసీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అడ్డతీగల మండలాలు, అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం మండలాలు, కాకినాడ జిల్లాలో కోట నండూరు పల్నాడు జిల్లాలో అమరావతి మండలం, పార్వతీపురంమన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు మండలాలు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 12 మండలాలు, అనకాపల్లిలో 11 మండలాలు , పల్నాడులో 11 మండలాలు , వైఎస్ఆర్ జిల్లాలో 11 మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 8 మండలాలు, మొత్తం 102 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉదని అధికారులు హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రజలకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని.. ఒకవేళ బయటకు వెళ్తే ఎండవేడిమికి గురికాకుండా గొడుగుల ఉపయోగించాలని, లైట్ కలర్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

అలాగే ఈనెల 28న ఉత్తరకోస్తాలో ఎండలు పెరుగుతాయని, ఆ తరువాత వర్షాలు కురవనున్నందున ఎండలు తగ్గుతాయని విశ్లేషించారు. కాగా, ఈనెల 30 నుంచి మే 3, 4 తేదీల వరకు రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ద్రోణి ఈనెల 29 నుంచి కోస్తాపైకి రానున్నందున వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాలతోపాటు గాలుల తీవ్రత ఉంటుందని, పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం వేళ ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నమోదు అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాధమిక అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో నివేదికలు సిద్దం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh