Anasuya: యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.. ‘చెప్పు తెగుద్ది’ అంటూ ఫైర్!

టాలీవుడ్ పాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఇప్పటికీ పలు బ్రాండ్ ప్రొమోషన్లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లతో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది.

అయితే కొన్నిసార్లు ట్రోలింగ్, అసభ్య వ్యాఖ్యలపైనా ఆమె నిశ్శబ్దంగా ఉండదు. తాజాగా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆమెపై కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో అనసూయ రెచ్చిపోయింది. ‘‘చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, ప్రియురాలు లేదా భార్యపై ఇలాగే కామెంట్లు చేస్తే మీరు ఊరుకుంటారా? పెద్దవారిని గౌరవించడం మీకు నేర్పలేదా?’’ అంటూ స్టేజి మీదే కఠినంగా వార్నింగ్ ఇచ్చింది.

అనసూయ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు మాత్రం సెలబ్రిటీల ప్రవర్తన కూడా బలమైన మోడల్ కావాలని సూచిస్తున్నారు.

Leave a Reply