Aghori: అఘోరి అసలు రూపం బయటపెట్టిన మొదటి భార్య.. వర్షిణీకి షాక్ ఇచ్చే నిజాలు..!

అఘోరిగా ప్రజల చుట్టూ తిరుగుతూ క్రేజ్ సంపాదిస్తున్న శ్రీనివాస్ అసలు రూపం ఇప్పుడు బయటపడింది. వర్షిణితో కలిసి జంటగా కనిపించిన అతనిపై అతని మొదటి భార్య సంచలన ఆరోపణలు చేసింది. “వాడొక మోసగాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు,” అంటూ ఓ ప్రెస్ మీట్‌లో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

తనతో ప్రేమ నాటకం వేసి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత తనని వదిలేసి వర్షిణిని భార్యగా చేసుకున్నాడని మండిపడింది. “వర్షిణిని కూతురుగా చెప్పిన వాడు.. ఇప్పుడు భార్య అంటున్నాడు! ఇది ఎంత దారుణమో ఊహించండి” అంటూ మీడియా ముందే బిగ్గరగా ప్రశ్నించింది.

తన తాళి కూడా బలవంతంగా లాకెళ్లాడని, అతడి మెడలో కనిపిస్తున్న వెండి తాడు తనదేనని వెల్లడించింది. “తన దగ్గర ఇప్పటికీ చాలానే ఆధారాలున్నాయి.. త్వరలో అన్నీ బయటపెడతా,” అని చెప్పింది. అంతేకాదు, “అతనికి పురుషాంగం లేదని చెప్పి, మహిళల మనసులతో ఆడుకుంటూ మాయాజాలం చేస్తున్నాడు,” అని ఆమె ఆరోపించింది.

ఇప్పటికే గోమాత ఆశ్రమం పేరు మీద తనను మోసం చేశాడని, ఇప్పుడు వర్షిణికీ అదే బురదలోకి లాగుతున్నాడని ఆవేదనతో చెప్పింది.

ఇంతకీ ఈ అఘోరి వ్యవహారం కొత్తేం కాదు. శ్రీనివాస్-వర్షిణి ఇటీవలే ఇద్దరు రెండు సార్లు పెళ్లి చేసుకున్నారని సమాచారం. మొదట విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున, తర్వాత వర్షిణి ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో బంగారం చైన్‌తో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహాలు అప్పుడే జరిగినా.. మొదటి భార్య ఎంట్రీతో ఇప్పుడు అసలు కథ వెలుగులోకి వచ్చింది.

ఈ వివాదం వెనుక ఇంకా ఎన్ని ముచ్చట్లు దాగున్నాయో చూడాలి. నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Leave a Reply