హైదరాబాద్ | 8 ఆగస్టు 2025: హైదరాబాద్‌లో వచ్చే రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో GHMC, హైడ్రా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల బయటకు రావొద్దని సూచించారు.
భారీ వర్షం కారణంగా నగరంలోని తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున, పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఎల్లో అలెర్ట్ జారీ చేసిన జిల్లాలు:
- సంగారెడ్డి
- కామారెడ్డి
- మెదక్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- భూపాలపల్లి
- నిర్మల్
ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో GHMC కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Emergency Helpline Numbers:
- 040-29555500
- 040-21111111
- 9000113667