పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్‌

Bandla Ganesh: పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్‌

పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమా తీసి మంచి లాభాలు పొందిన బండ్ల గణేష్‌కు పవర్‌‌స్టార్ అంటే విపరీతమైన అభిమానం. వీలు చిక్కిన ప్రతిసారీ పవన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రసంగాలు చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే ఫ్యాన్స్‌లో అందరికంటే ముందుంటారు నిర్మాత బండ్ల గణేష్ పవన్‌ను పొగడాలన్న అయన గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని చెప్పాలన్న బండ్ల గణేష్ తర్వాతే అని చెప్పాలి.సోషల్ మీడియాలో కూడా పొగిడేస్తుంటారు. పవన్ కల్యాణ్‌కు హార్డ్‌ కోర్ ఫ్యాన్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చేది బండ్ల గణేష్  పవన్‌ నామస్మరణ చేస్తూ నేను పవన్‌కు అభిమానిని కాదు భక్తుడిని అని చెప్పుకుంటారు ఆయన. పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ స్పీచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తారు. అలా పవన్ కల్యాణ్ భక్తుడిగా ప్రాచుర్యం పొందిన బండ్ల గణేష్ ఇటీవల పవన్ కల్యాణ్‌కు దూరంగా ఉంటున్నారు.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయ నాయకుడిగాఅటు నటుడిగా చాలా బిజీగా ఉన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రజల్లోకి వెళ్తుంటే పవన్‌కు మద్దతుగా చాలా మంది ఆయన వెంట నడుస్తున్నారు. అయితే ఈ విషయంలో బండ్లగణేష్ వెనకడుగు వేయడంతో ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి.

తాజాగా ఇలాంటి రూమర్స్ కు చెక్ పెట్టారు బండ్ల ఆయన పవన్ నుంచి ఎప్పుడు దూరంగా లేనని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లక్ష్యానికి అడ్డు వస్తానేమో అని కావాలనే పక్కకు వచ్చేశా అని అన్నారు. పవన్ నాకు ఎప్పటికీ దేవుడే కానీ మా అమ్మా నాన్నల కంటే ఆయనే ఎక్కువ నా భార్య బిడ్దల కంటే ఆయనే ఎక్కువ అని అనలేను అన్నారు.

అంతరాత్మకి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను ఆ దారిలో వెళ్ళాను. ఒక వ్యక్తిని కన్నవాళ్లకంటే  భార్య బిడ్డలకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పినా అది అబద్ధమే.  అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముందున్న లక్ష్యం వేరు. అందువలన ఆయనకు అడ్డు రాకూడదని పక్కకి వచ్చేశాను.

 

Leave a Reply