Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా మారింది. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ముందంజలో దూసుకెళ్లారు. అయితే గురువారం సాయంత్రం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డి 7,505 ఓట్లతో ముందంజలో ఉండగా పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మాణిక్ రెడ్డి 4569 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో PRTU అభ్యర్థి చెన్నకేశవ రెడ్డిపై AVN రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 12,709. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపు నిర్ధారణ కాకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది.
అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి లకు భారీగా ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేషన్ చేశారు.
అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్‌ని నింపింది. విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. అవినీతితో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనేందుకు ఈ గెలుపే నిదర్శనమన్నారు అమిత్‌షా అటు బండి సంజయ్‌తోపాటు పార్టీ నయకత్వాన్ని కూడా అభినందించారు నడ్డా ఈ మేరకు ఈ ఇరువురు నేతలు తెలుగులో ట్వీట్ చేశారు.
టీచర్ ఎమ్మెల్సీ విక్టరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాయి పార్టీ శ్రేణులు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సంబరాల్లో బండి సంజయ్, డీకే అరుణ, ఏవీఎన్ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. విజయం సాధించిన రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు బండి సంజయ్. అప్రజాస్వామిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు బండి సంజయ్ బీజేపీ విజయంలో భాగమైన ఉపాధ్యాయులకు అభినందనలు చెప్పారు.
https://twitter.com/AmitShah/status/1636661260447264768?s=20
https://twitter.com/JPNadda/status/1636609385559654400?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1636609385559654400%7Ctwgr%5E85a8dc47fde1922e7daaa7c481beaa8b4c206c08%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftelangana%2Funion-home-minister-amit-shah-congrats-to-avn