“నాన్నా.. అమ్మకు చెప్పకు.. ఆమె ఒప్పుకోదు” అని తొలుత భయపడి తన కలలను దాచిన అమ్మాయి – ఈరోజు దేశవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె ఎవరో కాదు – భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. మహిళా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే ఈ కథనం చదవగానే గర్వం కలగక మానదు.
భయంతో మొదలైన ప్రయాణం – గర్వంగా ముగిసిన విజయగాధ
వ్యోమికా సింగ్ పదవ తరగతిలోనే పైలట్ కావాలనే కలలు కనేది. కానీ, మొదట్లో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. ‘‘నాన్నా.. అమ్మకు చెప్పకు. ఆమె ఒప్పుకోదు’’ అని తన కలను దాచుకున్న ఆ అమ్మాయి, ఇప్పుడు భారత వైమానిక దళంలో అత్యున్నత స్థాయికి ఎదిగింది.
బాల్యంలోనే స్పష్టమైన లక్ష్యం
వ్యోమిక చిన్ననాటి నుంచే భిన్నంగా ఆలోచించేది. సాధారణ బాలికలతో పోలిస్తే సాహసంగా ఉండేది. ఆమె స్కూల్లో జరిగిన ఓ పోటీలో అబ్బాయిని ఓడించి రూ. 20,000 బహుమతి గెలిచిన ఘనతను కూడా సాధించింది. ఆమె తల్లి వ్యోమికపై “ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉండేది. ఆమెకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ” అని గర్వంగా చెబుతోంది.
అమ్మాయిలు ఎందుకు చేయకూడదు?
తల్లి: “ఇలాంటివి అమ్మాయిలు ఎందుకు చేయాలి?” అని అడిగినపుడు, వ్యోమిక బలంగా చెప్పింది – “అమ్మా.. అమ్మాయిలకి, అబ్బాయిలకి తేడా ఎందుకు ఉండాలి? మనకిష్టమైనది చేసేదే నిజమైన విజయము.” ఆమె ఆత్మవిశ్వాసమే ఆమె జీవితానికి మలుపు తిప్పింది.
ఫైనల్ ఎంపిక – తల్లి షాక్
ఐఎఎఫ్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఎంపికైనప్పుడు వ్యోమిక తన తండ్రిని పిలిచి, ‘‘నాన్నా.. అమ్మకు చెప్పకు’’ అనడం వెనుక అమ్మ ఒప్పుకోకపోవచ్చనే భయం. కానీ ఆ శుభవార్తను మొదట తల్లికే చెప్పింది. మొదట నమ్మని తల్లి, ఆ తర్వాత షాక్ అయ్యింది. నేడు అదే తల్లి గర్వంగా “మా అమ్మాయి దేశానికే ఆదర్శం” అంటోంది.
“తల్లి ఒప్పుకోలేదు అని భయపడ్డ అమ్మాయి.. తల్లి గర్వపడేంతవరకు ఎదిగింది – ఇదే నిజమైన అమ్మకూతురి ప్రేమ.”
“తల్లులు మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు.. మన కలలను అంగీకరించేంతవరకు మన పోరాటంలో భాగం కావాలి.”