ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ దళపతిపై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో ఆయన అభిమాని శరత్‌కుమార్ వేదికపైకి వెళ్లి విజయ్‌ను కలవాలని ప్రయత్నించాడు. ఈ సమయంలో బౌన్సర్లు ఆయనను అడ్డుకొని దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అభిమానంతో వెళ్ళిన తనపై అనవసరంగా దాడి చేశారని శరత్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TVK தலைவர் விஜய் மீது 3 பிரிவுகளில் வழக்குப்பதிவு👌👌
ரேம்ப் வாக்கில் தொண்டரை தூக்கி வீசிய புகாரில் விஜய் அவரது பவுன்சர்கள் உட்பட 10 பேர் மீது பெரம்பலூர் குன்னம் போலீஸ் வழக்குப்பதிவு
தூக்கி ஜெயில்ல போடுங்க சார் அப்பவாச்சும் திருந்துறாங்களான்னு பார்ப்போம் @tnpoliceoffl pic.twitter.com/RRdNR8qRjU
— Dr.Deva (@iamdrdeva) August 27, 2025
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో విజయ్ బౌన్సర్లకు అలా చేయవద్దని చెప్పడం కూడా రికార్డ్ అయ్యింది. బాధితుడు తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించగా, వారు విజయ్‌తో పాటు ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హీరో విజయ్ దళపతి తాజాగా తమిళనాడులో తమిళగ వెట్రి కళగం (TVK) అనే కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ బరిలో దిగనుంది. పార్టీ బలోపేతం కోసం విజయ్ రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సినిమాల ద్వారా ఆయనకు విపరీతమైన అభిమాన బలం ఉండటంతో, మీటింగ్‌లకు అభిమానులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.