తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ స్పందించారు. ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయ్ “నా హృదయం గాయంతో నిండిపోయింది. ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఇలాంటి దారుణ పరిస్థితిని నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. నా మనసు ఆందోళనతో నిండిపోయింది” అని ఎమోషనల్ అయ్యారు.
కరూర్‌లో ఈ ఘటన ఎందుకు జరిగిందంటే
విజయ్ చెప్పినట్లుగా, తమవైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా, బాధితుల కుటుంబాలపట్ల కనీస పర్యవేక్షణతో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. “నా జీవితంలో ఇంత బాధను ఎప్పుడూ అనుభవించలేదు. ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. కానీ నన్ను ప్రేమించే వారి భద్రత విషయంలో రాజీ ఉండకూడదు. రాజకీయాలకు మించి సేఫ్ జోన్‌లో సభ జరగాలి అని కోరాను. కానీ ఊహించని ఘటన నన్ను ఎంతో మనోవేదనకు గురిచేసింది. 5 జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తే కరూర్‌లోనే ఇలా ఎందుకు జరిగింది? త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తాను. మేము ఏ తప్పు చేయకపోయినా పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్ మీడియా వినియోగదారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం దారుణం. ప్రజల ప్రాణాలు పోవాలని ఏ నాయకుడు అనుకోడు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నిజాలన్నీ త్వరలో వెలుగులోకి వస్తాయి” అని చెప్పారు.
இறுதியில் இன்று விஜய் மெளனத்தை கலைத்திருக்கிறார். சி.எம் சார் என் மீது உங்களுக்கு கோபம் இருந்தால் என்னிடம் காட்டுங்கள், எங்கள் தோழர்கள் மீது வேண்டாம் என்றும் பாதிக்கபப்ட்ட மக்களுக்கு இரங்கல் சொல்லி முடித்துள்ளார். #Vijay pic.twitter.com/HQ0zzSdgJt
— கபிலன் (@_kabilans) September 30, 2025
సీఎం స్టాలిన్‌పై షాకింగ్ కామెంట్స్
విజయ్ ఈ సందర్భంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌పై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “సీఎం సర్, మీరు నాపై పగ తీర్చుకోవాలనుకుంటే ఏమైనా చేయండి. నేను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉంటాను. కానీ ప్రజల భద్రతకు తాకట్టుగా వ్యవహరించరాదు. నా పొలిటికల్ జర్నీ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది” అని అన్నారు.
ఎఫ్‌ఐఆర్ & అరెస్టులు
తమిళనాడు పోలీసులు కరూర్ జిల్లా కార్యదర్శి మథియలగన్‌ను ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు. అయితే టీవీకే చీఫ్ విజయ్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేదు. మథియలగన్, బుస్సీ ఎన్. ఆనంద్ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), సీటీఆర్ నిర్మల్ కుమార్ (రాష్ట్ర సంయుక్త కార్యదర్శి) పేర్లు మాత్రమే ఉన్నాయి. విజయ్ రోడ్‌షోలకు చేరుకునే ముందు, వీరు ముగ్గురు అనధికారికంగా రోడ్‌షోలు నిర్వహించినందున పెద్ద జనసమూహం ఏర్పడిందని వాదనలు వినిపిస్తున్నాయి.