Vice President Election 2025 : ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ ఘన విజయం.. మెజార్టీ వివరాలు

2025 ఉపరాష్ట్రపతి ఎన్నికలో (Vice President Election 2025) ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో గెలుపు సాధించడం విశేషం.

ఈ ఎన్నికలో రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చినా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు లెక్కలోకి రాలేదు. పార్లమెంట్‌లో మొత్తం 781 మంది ఎంపీలు ఉన్నప్పటికీ 767 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్, బీజేడీ, అకాళీదళ్‌ సభ్యులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఫలితాలు సాయంత్రం 6 గంటలకు లెక్కింపు పూర్తి చేసాక ప్రకటించారు.

రాధాకృష్ణన్ రాజకీయ జీవితం:
రాధాకృష్ణన్ ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఎంపీగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్‌గా, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా అత్యున్నత స్థాయికి ఎదిగారు.

తిరుప్పూరులో జన్మించి, 16 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో స్వయంసేవకగా ప్రారంభించారు.

భారతీయ జనతా పార్టీ (BJP)లో కీలక పాత్ర పోషించారు.

కోయంబత్తూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

గవర్నర్‌గా బాధ్యతలు:

జార్ఖండ్ గవర్నర్: ఫిబ్రవరి 2023 – జూలై 2024

తెలంగాణ గవర్నర్: మార్చి 2024 – జూలై 2024

మహారాష్ట్ర గవర్నర్: జూలై 2024 – ప్రస్తుతం

Leave a Reply