అబ్బాయిలంటే పడదు.. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వీడియో వైరల్..!

ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఇద్దరు అమ్మాయిలు కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అబ్బాయిలు అంటే ఆసక్తి లేకపోవడం, వారిపై విశ్వాసం లేకపోవడం వల్లే తాము ఒకరికొకరు పెళ్లి చేసుకున్నామని వారు చెప్పారు.

సుప్రీం కోర్టు స్వలింగ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించకపోయినా, తాము భార్యాభర్తలుగా కలిసి జీవించనున్నామని స్పష్టం చేశారు. కుటుంబాలు ఒప్పుకోకపోతే సంబంధాలు తెంచుకుంటామని కూడా స్పష్టం చేశారు.

సమాజంలో సేమ్-జెండర్ (Same Gender) పెళ్లులు రోజు రోజుకీ పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ ఘటనపై నెట్టింట చర్చలు జోరుగా సాగుతున్నాయి. తమ జీవితం తమది అని, సంతోషంగా ఉండటమే లక్ష్యమని, తమ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని లాయర్‌ను కోరినట్లు తెలుస్తోంది.

Leave a Reply