September Bank Holidays : సెప్టెంబర్‌లో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి లిస్టు ఇదే!

ఆగస్టు నెల ముగియనుండగా, సెప్టెంబర్ నెల ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి సెప్టెంబర్ నెలలో బ్యాంకులు దాదాపు 15 రోజులు మూతబడనున్నాయి. వీటిలో పండుగల సెలవులు, వారాంతపు ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు ఉన్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో సెలవులు వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించిన సెలవులు తప్పక చూసుకోవాలి.

సెప్టెంబర్ 2025 బ్యాంక్ హాలీడేల లిస్ట్:

3 సెప్టెంబర్ (బుధవారం): కర్మ పూజ – జార్ఖండ్, రాంచీ

4 సెప్టెంబర్ (గురువారం): మొదటి ఓనం – కేరళ (తిరువనంతపురం, కొచ్చి)

5 సెప్టెంబర్ (శుక్రవారం): ఈద్-ఎ-మిలాద్ / మిలాద్-ఉన్-నబీ – అనేక రాష్ట్రాలు

6 సెప్టెంబర్ (శనివారం): ఈద్-ఎ-మిలాద్ – గాంగ్టక్, రాయ్‌పూర్

7 సెప్టెంబర్ (ఆదివారం): వీక్లీ హాలిడే (ఆల్ ఇండియా)

12 సెప్టెంబర్ (శుక్రవారం): ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ – జమ్మూ, శ్రీనగర్

13 సెప్టెంబర్ (శనివారం): రెండో శనివారం (ఆల్ ఇండియా)

14 సెప్టెంబర్ (ఆదివారం): వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)

21 సెప్టెంబర్ (ఆదివారం): వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)

22 సెప్టెంబర్ (సోమవారం): నవరాత్రి – జైపూర్

23 సెప్టెంబర్ (మంగళవారం): మహారాజా హరి సింగ్ జయంతి – జమ్మూ, శ్రీనగర్

27 సెప్టెంబర్ (శనివారం): నాల్గో శనివారం (ఆల్ ఇండియా)

28 సెప్టెంబర్ (ఆదివారం): వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)

29 సెప్టెంబర్ (సోమవారం): మహా సప్తమి/దుర్గా పూజ – అగర్తల, గౌహతి, కోల్‌కతా

30 సెప్టెంబర్ (మంగళవారం): మహా అష్టమి/దుర్గా పూజ – అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‌కతా, పాట్నా, రాంచీ

ముఖ్య గమనిక:

బ్యాంక్ బ్రాంచులు మూతపడినా, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. అయితే బ్యాంక్ బ్రాంచ్‌కి పనిమీద వెళ్లాల్సిన వారు ముందుగానే ఈ సెలవుల లిస్టు చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Leave a Reply