SBI డిజిటల్ సేవల్లో తాత్కాలిక విరామం – ఖాతాదారులు అప్రమత్తంగా ఉండండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అక్టోబర్ 11, 2025 నాడు కొన్ని డిజిటల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తుందని ప్రకటించింది. రాత్రి 1:10 గంటల నుండి 2:10 గంటల వరకు యూపీఐ (UPI), IMPS, NEFT, RTGS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ప్రధాన డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉండవు.

ఈ సమయంలో ATM లు మరియు UPI Lite సేవలు పనిచేస్తాయి. UPI Lite ద్వారా ₹1,000 వరకు PIN అవసరం లేకుండా లావాదేవీలు చేయవచ్చు, కానీ ఇవి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో కనిపించవు.

SBI ఖాతాదారులు ముఖ్యమైన లావాదేవీలను ముందుగా పూర్తి చేసుకోవాలని, అవసరమైతే ఇతర బ్యాంకుల ఖాతాలను ఉపయోగించమని లేదా నగదు తీసుకోవాలని సూచించింది. సేవలు 2:10 గంటల తరువాత మళ్లీ ప్రారంభమవుతాయని బ్యాంక్ తెలిపారు.

Leave a Reply