కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బీహార్‌లో ఓటర్ హక్కు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ససారాం నుండి మొదలై, 16 రోజుల పాటు 25 జిల్లాల మీదుగా కొనసాగనుంది. “ఒక వ్యక్తికి ఒక ఓటు” అనే నినాదంతో, బీహార్‌లో జరుగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టబడుతోంది.
మొత్తం 1300 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో కొంతదూరం కాలినడకన, మరికొంతదూరం వాహనంపై హైబ్రిడ్ మోడల్‌లో కీలక నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగనుంది. ప్రధానంగా రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.
ఇండియా అలయన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక మార్చ్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో పాటు మహాఘట్బంధన్ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ముగియనుంది. కాంగ్రెస్ నేతల ప్రకారం ఇది ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
🗳 Today’s Political Coincidence
📅 Sunday, 17 August 2025
🕒 3:00 PM — Sasaram, Bihar
➡️ Leader of Opposition in Lok Sabha Rahul Gandhi kicks off the “Voter Adhikar Yatra”
🎯 Purpose: Democratic Right – The Struggle to Protect ‘One Person, One Vote’🕒 3:00 PM — New Delhi
➡️… pic.twitter.com/nXh0ujiM24— karan darda (@karandarda) August 17, 2025
ఓటర్ హక్కు యాత్ర షెడ్యూల్:
ఆగస్టు 17 – ససారం, రోహ్తాస్ (యాత్ర ప్రారంభం)
ఆగస్టు 18 – దేవ్ రోడ్, అంబా-కుందుంబ
ఆగస్టు 19 – హనుమాన్ మందిర్, పూనం, వజీర్‌గంజ్
ఆగస్టు 20 – విశ్రాంతి దినం
ఆగస్టు 21 – తీన్ మోహని దుర్గా మందిర్, షేక్‌పురా
ఆగస్టు 22 – చంద్ర బాగ్ చౌక్, ముంగేర్
ఆగస్టు 23 – కుర్సేలా చౌక్, బరారి, కతిహార్
ఆగస్టు 24 – ఖుష్కీబాగ్, కతిహార్ నుండి పూర్నియా వరకు
ఆగస్టు 25 – విశ్రాంతి దినం
ఆగస్టు 26 – హుస్సేన్ చౌక్, సుపాల్
ఆగస్టు 27 – గంగ్వారా మహావీర్ స్థాన్, దర్భంగా
ఆగస్టు 28 – రిగా రోడ్, సీతామర్హి
ఆగస్టు 29 – హరివాటికా గాంధీ చౌక్, బెట్టియా
ఆగస్టు 30 – ఎక్మా చౌక్, ఛప్రా
ఆగస్టు 31 – విశ్రాంతి దినం
సెప్టెంబర్ 1 – పాట్నాలో గ్రాండ్ ఫినాలే ర్యాలీ