Pawan Singh : హీరోయిన్‌ నడుమును అసభ్యంగా తాకిన పవన్ సింగ్.. అంజలి సంచలన నిర్ణయం!

భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఓ స్టేజ్ ఈవెంట్‌లో సహనటి అంజలి నడుమును అసభ్యంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఘటనపై మొదట మౌనం పాటించిన అంజలి, చివరకు స్పందిస్తూ ఇకపై పవన్‌తో సినిమాలు చేయనని స్పష్టంగా చెప్పింది.

పవన్ సింగ్ భోజ్‌పురి ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగర్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా జరిగిన ఈ ఘటన అతనిపై తీవ్ర విమర్శలు రేపింది. వేదికపై అంజలి నడుమును పదే పదే తాకుతూ ఇబ్బంది పెట్టిన వీడియో చూసిన నెటిజన్లు పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొదట రెండు రోజులు మౌనం పాటించిన అంజలి, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా తన మనసులోని బాధను బయటపెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Anjali Raghav (@anjaliraghavonline)

ఆమె మాటల్లో.. “గత రెండు రోజులుగా నేను చాలా ఇబ్బందిపడుతున్నాను. లక్నోలో జరిగిన ఈవెంట్‌లో పవన్ సింగ్ నన్ను అనుమతి లేకుండా నడుము వద్ద తాకాడు. మొదట అది పొరపాటుగా జరిగిందని అనుకున్నాను. కానీ తర్వాత నా టీమ్ చెప్పిన తర్వాత నిజం తెలిసి షాక్ అయ్యాను. ఈ విషయం బయట పెట్టాలనుకున్నప్పటికీ పవన్‌కు పెద్ద నెట్‌వర్క్ ఉందని కొందరు నన్ను బెదిరించారు. అందుకే సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలాంటివి భరించడం కష్టమవుతోంది. ఇకపై భోజ్‌పురి సినిమాల్లో నటించను. ముఖ్యంగా పవన్ సింగ్‌తో మాత్రం అసలు చేయను” అని అంజలి స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, నెటిజన్లు పవన్ సింగ్‌ను తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Leave a Reply