PM Modi: దేశ ప్రజల కోసం ప్రధాని మోదీ సంచలన లేఖ.. జీఎస్టీ పై కీలక సూచనలు

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ఒక సంచలనాత్మక లేఖ విడుదల చేశారు. నేటి నుంచే దేశవ్యాప్తంగా జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభమైందని ప్రకటించారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించి, కొనుగోలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మోదీ లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలు:

జీఎస్టీ సంస్కరణలు ప్రజల పొదుపును పెంచుతాయి.

రైతులు, యువత, మహిళలు, వ్యాపారులు, MSMEలు, మధ్యతరగతి వంటి అన్ని వర్గాలకూ లాభం కలుగుతుంది.

ఆర్థిక వృద్ధి పెరిగి, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది.

శ్లాబుల తగ్గింపుతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుంది.

ఇప్పటికే దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ తెలిపారు.

ఆదాయపు పన్ను పరిమితిని రూ.12 లక్షల వరకు మినహాయించామని గుర్తుచేశారు.

కొత్త జీఎస్టీ శ్లాబుల ద్వారా ఈ ఏడాది ప్రజలకు సుమారు రూ.2.50 లక్షల కోట్ల పొదుపు కలుగనుందని తెలిపారు.

“వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే మనమందరం స్వయం సమృద్ధి బాటలో నడవాలి. కొత్త జీఎస్టీ సంస్కరణలు స్థానిక తయారీ రంగానికి బలాన్నిస్తాయి. దుకాణదారులు స్వదేశీ వస్తువులనే అమ్మాలి. ప్రజలు కూడా స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. పరిశ్రమలకు, పెట్టుబడులకు రాష్ట్రాలు అనుకూల వాతావరణం కల్పించాలి” అని లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఆదివారం జరిగిన ప్రసంగంలో కూడా ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని మరోసారి స్పష్టం చేశారు.

Leave a Reply