అక్టోబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్.. గ్యాస్, రైలు టిక్కెట్లు, UPI, గేమింగ్, పెన్షన్ ప్లాన్స్

ప్రతి నెలా కొన్ని ముఖ్యమైన మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా LPG గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తప్పకుండా మారుతాయి. ఇక అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్, రైలు టిక్కెట్లు, బ్యాంకింగ్ వడ్డీ రేట్లు, UPI పేమెంట్స్, పెన్షన్ ప్లాన్‌లలో కీలకమైన మార్పులు అమల్లోకి రానున్నాయి.

ఆన్‌లైన్ గేమింగ్
ఆన్‌లైన్ గేమింగ్‌లో మోసాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు అమల్లోకి రానుంది. దీని ప్రకారం డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ అన్ని నిషేధం కానున్నాయి.

రైలు టికెట్ బుకింగ్
రైల్వే టికెట్ రూల్స్‌లో కూడా మార్పులు వచ్చాయి. ఇకపై అక్టోబర్ 1 నుంచి ఆధార్ వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారు మాత్రమే రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బుకింగ్ ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లో టిక్కెట్ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి అయి ఉండాలి.

బ్యాంకింగ్ రంగం
బ్యాంకింగ్‌లో వడ్డీ రేట్లు, రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పొదుపు పథకాలలో కొత్త మార్పులు అమల్లోకి వస్తాయి. పెట్టుబడిదారులు ఈ మార్పులను తప్పక తెలుసుకోవాలి.

UPI పేమెంట్స్
అక్టోబర్ 1 నుంచి యూపీఐలో పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ (UPI ID ద్వారా నేరుగా ఒకరి నుంచి మరొకరికి పేమెంట్స్) నిలిపివేయనున్నారు. ఇకపై వినియోగదారులు స్కాన్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయగలరు. ఇది వినియోగదారుల భద్రత కోసం తీసుకున్న నిర్ణయం.

గ్యాస్ సిలిండర్ ధరలు
ఎప్పటిలాగే అక్టోబర్ 1న LPG గ్యాస్ సిలిండర్ల ధరలు సవరించబడతాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ధరలను మార్చుతుంటాయి.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
NPS చందాదారులు ఇకపై ఈక్విటీలలో వంద శాతం వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రభుత్వేతర చందాదారులు కూడా తమ పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే అవకాశం పొందనున్నారు.

Leave a Reply