New GST Slabs : మారిన జీఎస్టీ శ్లాబ్ రేట్స్.. కార్ల నుంచి బిస్కెట్ల వరకూ తగ్గిన ధరల లిస్ట్ ఇదే!

56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పులు చేశారు. ఇకపై రెండు శ్లాబ్‌లు మాత్రమే కొనసాగనున్నాయి.. 5% మరియు 18%. ఈ మార్పులు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయి. విలాస వస్తువులపై 40% పన్ను యథావిధిగా కొనసాగుతుంది. రైతులు, సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

బీమాలకు మినహాయింపు

జీఎస్టీ మార్పులతో పాటు అన్ని రకాల జీవిత, ఆరోగ్య, టర్మ్‌ బీమాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయించారు. అలాగే 33 రకాల మందులపై 12% జీఎస్టీ తొలగించారు. థర్మామీటర్లు, ఆక్సిజన్ పరికరాలు, గ్లూకోమీటర్లు, కళ్లజోళ్ళపై 5% పన్ను మాత్రమే వసూలు చేయనున్నారు.

18% జీఎస్టీ కిందకు వచ్చినవి

ఏసీలు (28% నుంచి 18%)

సిమెంట్

350 సీసీ లోపు వాహనాలు

త్రీ వీలర్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లు (28% నుంచి 18%)

హస్తకళ ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ (12% నుంచి 5%)

ఎలక్ట్రిక్ వాహనాలు (5% యథావిధిగా)

5% జీఎస్టీ కిందకు వచ్చినవి

హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, సబ్బులు, బ్రష్‌లు, షేవింగ్ క్రీమ్ (18% నుంచి 5%)

వెన్న, నెయ్యి, చీజ్, డెయిరీ ఉత్పత్తులు

ప్యాక్‌డ్ నమ్కీన్స్, భుజియా, మిక్చర్లు

UHT పాలు, పన్నీర్, ఇండియన్ బ్రెడ్ (జీఎస్టీ పూర్తిగా మినహాయింపు)

ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్లు, డైపర్లు

ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలు (12% నుంచి 5%)

బయో పెస్టిసైడ్స్, సూక్ష్మ పోషకాలు, సేద్య పరికరాలు

మ్యాప్స్, చార్టులు, గ్లోబ్స్, పెన్సిల్స్, నోట్‌బుక్స్ (12% నుంచి 5%)

40% జీఎస్టీ కింద కొనసాగేవి

రేస్ క్లబ్బులు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్

పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, పొగాకు ఉత్పత్తులు

నాన్ ఆల్కాహాలిక్ పానీయాలు (ఫ్రూట్ జ్యూస్ కాకుండా)

1200 సీసీ పైగా పెట్రోల్ కార్లు, 1500 సీసీ పైగా డీజిల్ కార్లు

Leave a Reply