Nita Ambani Car: నీతా అంబానీ గ్యారేజీలో అరుదైన ఆడి A9 ఛమేలియన్‌ కార్.. ధర రూ. 100 కోట్లు!

అపార కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. అంబానీ కుటుంబంలో ఇప్పటికే ప్రపంచంలోనే అరుదైన, ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ, తాజాగా నీతా అంబానీ తమ గ్యారేజీలో కొత్త లగ్జరీ కారును యాడ్ చేశారు. దీని ధర అక్షరాల 100 కోట్లు!

ఈ కార్ పేరు ‘ఆడి A9 ఛమేలియన్’. ఈ అద్భుతమైన కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 11 కార్లు మాత్రమే ఈ మోడల్ లభ్యమవుతాయని తెలుస్తోంది. ఇది అత్యాధునిక డిజైన్, టెక్నాలజీతో కలసి ప్రత్యేక పనితీరుతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.

ఛమేలియన్ పెయింట్ వర్క్ ఈ కారుకు మరో ప్రత్యేకత. కారు వెలుతురు, చూసే కోణానికి అనుసరించి రంగులు మారుతుంది. అందువల్ల ఇది ఎంతో అందంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. కారు లోపల కూడా అత్యంత విలాసవంతమైన ఫీచర్లు, నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. బయట నుంచి చూస్తే ‘కుర్చీలా’ అనిపిస్తే, లోపల ఎంతో విలాసవంతంగా ఉంటుంది.

అంబానీ కుటుంబంలో ఉన్న అరుదైన లగ్జరీ కార్లు:

మెర్సిడెస్-బెంజ్ మేబాక్ S600 గార్డ్: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన, బులెట్ ప్రూఫ్ మరియు బాంబ్ ప్రూఫ్ కార్లలో ఒకటి. ధర సుమారు రూ. 10 కోట్లు. నీతా అంబానీ సేఫ్టీ కోసం ఉపయోగిస్తారు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్: అంబానీ కుటుంబం ఎంతో ఇష్టపడే కార్లు. ఈ మోడల్ పై ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ’ అనే గోల్డ్ ఫిగర్ ఉంటుంది. నీతా స్వయంగా కస్టమైజ్ చేసినది. హెడ్రెస్ట్ పై “NMA” (నీతా ముఖేష్ అంబానీ) ఎంబ్రాయిడరీ కూడా ఉంది. ధర సుమారు ₹8.99 కోట్ల నుంచి ₹10.48 కోట్ల వరకు.

రోల్స్ రాయిస్ కల్లినన్: ముఖేష్ అంబానీ గ‌తేడాది నీతాకు బహుమతిగా ఇచ్చిన కారు. పెయింటింగ్ కోసం సుమారు కోటి రూపాయల ఖర్చు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ధర సుమారు ₹10 కోట్లు.

ఇతర లగ్జరీ కార్లు: బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ 760Li సెక్యూరిటీ మోడల్ కార్లు కూడా ఈ కుటుంబంలో ఉన్నాయి.

ఈ విలాసవంతమైన కార్లు నీతా అంబానీ జీవిత శైలిని మరోసారి ప్రదర్శిస్తున్నాయి.

Leave a Reply