PM Modi: నవరాత్రి సందర్భంగా జాతిని ఉద్దేశించి మోదీ సంచలన ప్రకటన..!

నవరాత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని దృష్టిలో ఉంచుకుని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలు కాబోతున్నాయని, ఆత్మనిర్భర్‌ భారత్‌ వైపు దేశం అడుగులు వేస్తోందని చెప్పారు. జీఎస్టీ మార్పుల వల్ల పేద, మధ్యతరగతి ఆదాయంలో పెరుగుదల కాబట్టి ప్రజలకు ప్రత్యేక లాభాలు వస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు.

2017లో జీఎస్టీ ప్రవేశంతో పన్నుల వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమయిందని మోదీ గుర్తు చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తువులు తరలించేటప్పుడు ఎదురయ్యే పన్నుల ఇబ్బందులు ఇప్పుడు తగ్గాయని, గడచిన కాలంలో కంపెనీలు ఎదుర్కొన్న టాక్స్, టోల్ భారాలు వినియోగదారులపై పడుతాయని చెప్పారు.

మోదీ 2024లో గెలిచిన తర్వాత జీఎస్టీకి ప్రాధాన్యం ఇచ్చామని, అన్ని వర్గాలతో చర్చలు జరిపి వన్‌ నేషన్‌-వన్‌ టాక్స్ కలను సాకారం చేసినట్టుగా చెప్పారు. కొత్త జీఎస్టీ ద్వారా నిత్యావసర వస్తువులు మరింత చౌకగా లభిస్తాయని, కొన్నింటికి పన్ను మినహాయింపు, మరికొన్నింటికి 5 శాతం పన్ను మాత్రమే పెట్టామని వివరించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను తొలగించిన ఈ చర్యలు మధ్యతరగతివారి జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని చెప్పారు.

అలాగే, 99 శాతం వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకి మార్చినట్లు, చిన్న పరిశ్రమలు భారత్ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తున్నాయనీ, ప్రజలు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనాలని మోదీ కోరారు. స్వదేశీ వస్తువులను కొనడం మీద గర్వంగా ఉండాలన్నారు.

Leave a Reply