Pawan Kalyan: మోదీ అంటే ‘అనికేత్’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పవన్ మోదీని “అనికేత్‌”గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అనికేత్ అంటే శివుడి రూపం, సంకల్పబలానికి నిదర్శనం అని పవన్ వివరించారు.

తన సన్యాస జీవితం నుంచి దేశ సేవ వరకు మోదీ ప్రదర్శించిన త్యాగం మరియు అంకితభావం పట్ల పవన్ కళ్యాణ్ కొనియాడారు. ‘‘అనికేత్ అంటే ఇల్లు లేని జీవితం గలవాడు. కానీ అతడి కోసం దేశమే ఇల్లు’’ అని పవన్ స్పష్టం చేశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి భాగాన్ని మోదీ తన ఇంటిగా భావించారని తెలిపారు. మోదీకి స్వంత ఇల్లు లేకపోయినా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది మంది పేదలకు గృహాలు అందించిన ఘనత ఆయనదేనని పవన్ ప్రశంసించారు.

ఇంతకంటే ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్ పై కూడా స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సింధూర్ ఆపరేషన్ విజయవంతమైందని, ఈ దాడిలో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. దేశానికి ఎవరైనా గీత దాటి వస్తే ఉపేక్షించబోమన్న బలమైన సందేశాన్ని భారత్ ఇచ్చిందని పవన్ స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో ప్ర‌తి ఒక్క‌రు ఐక్యంగా మోదీకి మద్దతుగా నిలవాలని కోరారు.

తాజాగా, దేశాన్ని విమర్శించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. ‘‘దేశ విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవ్’’ అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు యువతలో దేశభక్తిని ప్రోత్సహించడంతోపాటు, సోషల్ మీడియాలో దేశానికి మద్దతుగా ఓ పాజిటివ్ వాతావరణాన్ని కల్పించాయి.

Leave a Reply