Income Tax Bill 2025: లోక్‌సభలో కొత్త IT బిల్లు ఆమోదం.. సామాన్యులకు భారీ సౌలభ్యం!

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో సవరించిన ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టారు. 1961 నాటి పాత చట్టం స్థానంలో కొత్త IT చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టింది.

గతంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బిల్లులో కొన్ని సాంకేతిక, విధానపరమైన లోపాలు ఉండడంతో విపక్షాలు వ్యతిరేకత తెలిపాయి. ఆ కారణంగా ఈ బిల్లును కేంద్రం పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపింది. ఇప్పుడు పాత ఆదాయపు చట్టం రద్దు చేసి, కొత్త IT చట్టాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

కొత్త బిల్లులో సెలెక్ట్ కమిటీ సూచనలలో చాలా వాటిని ప్రభుత్వం చేర్చింది. బయ్యంత పాండా నేతృత్వంలోని కమిటీ గత నెలలో 4,500 పేజీల నివేదికను సమర్పించింది, ఇందులో మొత్తం 285 ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మార్పుల ఉద్దేశ్యం పన్నుల విధానాన్ని మరింత స్పష్టంగా, సరళంగా రూపొందించడం అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

కొత్త IT బిల్లులో ముఖ్య మార్పులు:

పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం: ఆలస్యంగా రిటర్న్లు దాఖలు చేసినా రీఫండ్‌లు క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఆస్తి ఆదాయంపై పన్ను: ఖాళీ ఆస్తులపై డీమ్డ్ అద్దె పన్ను తొలగింపు. ఇంటి ఆస్తి ఆదాయంలో మునిసిపల్ పన్నులు తీసివేసిన తర్వాత 30% స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపు.

హోం లోన్ వడ్డీ తగ్గింపు: ఇంటి రుణ వడ్డీ తగ్గింపు అద్దెకు ఇచ్చిన ఆస్తులకు కూడా వర్తిస్తుంది.

పెన్షన్ మినహాయింపు: ఉద్యోగుల కాకపోయిన వారికి కూడా కమ్యూటెడ్ పెన్షన్‌పై పన్ను మినహాయింపు.

వివాదాల పరిష్కారం: పన్ను వివాదాలను తగ్గించేందుకు అస్పష్ట నిబంధనలు తొలగింపు.

కొత్త పన్ను కాన్సెప్ట్: ‘గత సంవత్సరం’ మరియు ‘అసెస్‌మెంట్ ఇయర్’ పద్దతులను తొలగించి, ‘టాక్స్ ఇయర్’ అనే కొత్త కాన్సెప్ట్ ప్రవేశపెట్టడం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కొత్త బిల్లు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు పన్నుల వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది.

ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించిన తర్వాత, రాజ్యసభకు పంపించి ఆమోదం తీసుకుంటారు. ఈ బిల్లు 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply