భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. జూన్ 4న లక్నోలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వీరి వివాహ తేదీపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
टीम इंडिया के स्टार क्रिकेटर और चाइनामैन गेंदबाज कुलदीप यादव ने अपनी बचपन की दोस्त से सगाई कर ली है.
कुलदीप और उनकी बचपन की दोस्त वंशिका के साथ सगाई की बहुत-बहुत बधाई एवं शुभकामनाएं।#KuldeepYadav #kuldeepyadavengagement #vanshika pic.twitter.com/zylfGDfnow— Priyanshu Modanwal – Samajwadi (@modanwalA2Y) June 4, 2025
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు కుల్దీప్ తన జీవితంలోని ప్రత్యేకమైన మెమొరిని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ హాజరవడంతో ప్రత్యేక ఆకర్షణగా మారింది. నిశ్చితార్థ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, క్రికెట్ స్టార్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కుల్దీప్ IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాణించాడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీసి, 7.07 ఎకానమీ రేట్‌తో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం ద్వారా తన కీలక పాత్రను నిరూపించుకున్నాడు. టెస్ట్ సిరీస్ కోసం త్వరలో ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు.
कुलदीप और उनकी बचपन की दोस्त वंशिका के साथ सगाई की बहुत-बहुत बधाई एवं शुभकामनाएं।#KuldeepYadav #kuldeepyadavengagement #vanshika pic.twitter.com/tjws6tG6xb
— Hemant Yadav 🇮🇳 (@INDHKY) June 5, 2025
కుల్దీప్ ప్రేమ కథ ఇలా నిశ్చితార్థం వరకు వచ్చిందన్న వార్త క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చిన్ననాటి స్నేహితురాలినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ద్వారా అతని వ్యక్తిగత జీవితం మరో కొత్త అధ్యాయానికి సిద్దమవుతోంది.