జూలై 1వ తేదీ నుంచి పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త పాన్ కార్డుల దరఖాస్తుల నుండి తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ వరకు, యుపీఐ చార్జ్‌బ్యాక్‌ల వరకు పలు రంగాల్లో రూల్స్ మారనున్నాయి. ప్రతి నెలా మొదటి తేదీన కస్టమర్లకు సంబంధించిన కొన్ని మార్పులు వస్తుంటాయి. ఆ నేపథ్యంలో జూలై 1నుంచి అమలులోకి రానున్న మార్పులు ఇలా ఉన్నాయి:
యుపీఐ ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియలో మార్పులు:
ఇకపై చట్టబద్ధమైన ఛార్జ్‌బ్యాక్ అభ్యర్థనలు తిరస్కరణకు గురైతే, వాటిని తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంటే, బ్యాంకులు నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని సంప్రదించాలి. అయితే ఈ కేసుల్లో NPCI జోక్యం లేకుండా బ్యాంకులు స్వయంగా రీప్రాసెసింగ్ చేయవచ్చు. ఇది రిఫండ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
కొత్త పాన్ కార్డులకు ఆధార్ తప్పనిసరి:
జూలై 1 నుంచి కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. అలాగే జనన ధృవీకరణ పత్రం కూడా అవసరం. ఆధార్ వెరిఫికేషన్ లేకుండా పాన్ కార్డు జారీ కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తత్కాల్ రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు:
ఇండియన్ రైల్వేస్ తాజాగా తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ఆధార్ ఆధారిత వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) తప్పనిసరిగా అవసరం.
తత్కాల్ టికెట్ బుకింగ్‌కు బుకింగ్ విండో తెరిచిన 30 నిమిషాల్లోపే టికెట్లు బుక్ చేసుకోవాలి.
AC క్లాస్ టికెట్లు: ఉదయం 10:00 – 10:30
Non-AC క్లాస్ టికెట్లు: ఉదయం 11:00 – 11:30