JEE Main 2025 తుది ర్యాంకులు నేడు విడుదల.. మీ స్కోర్‌కు సీటు వస్తుందా?

జేఈఈ మెయిన్‌ 2025 ఫైనల్ ర్యాంకులు మరియు తుది ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేడు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ (B.Tech), ఆర్కిటెక్చర్ (B.Arch) సీట్ల భర్తీకి సంబంధించిన కీలక సమాచారం ఇది.

ఈ ఏడాది జనవరి నెలలో మొదటి విడత, ఏప్రిల్ 2 నుండి 9 వరకు రెండవ విడతగా పరీక్షలు నిర్వహించారు. రెండూ రాసిన విద్యార్థులకు, రెండు పరీక్షల్లో ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఇటీవలే ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల గడువు ముగియగా, నేడు తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలు రానున్నాయి.

కేటగిరీల వారీగా అంచనా కటాఫ్ మార్కులు:

జనరల్ కేటగిరీ: 93% – 95%

OBC / EWS: 91% – 93%

SC: 82% – 86%

ST: 73% – 80%

ఈ కటాఫ్ ఆధారంగా టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు JEE Advanced 2025 కోసం అర్హులని ప్రకటించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ మే 18న జరగనుంది.

JEE Main 2025 Final Rank Card డౌన్‌లోడ్ లింక్, అడ్మిషన్ కటాఫ్స్, కౌన్సెలింగ్ వివరాలు కోసం https://jeemain.nta.nic.in/ ఈ వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయండి.

Leave a Reply