Jammu& Kashmir : కేంద్రం సంచలన నిర్ణయం: మళ్లీ రాష్ట్రంగా మారనున్న జమ్మూ కాశ్మీర్!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. అయితే, ఇటీవల శాంతి-భద్రతా పరిస్థితులు మెరుగుపడడంతో, సుప్రీంకోర్టు కేంద్రాన్ని జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

బిల్లు మొదట లోక్‌సభలో చర్చకు రానుంది. తర్వాత ఓటింగ్ జరగనుంది. ఆపై రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా తిరిగి లభించనుంది.

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పరిస్థితులను కేంద్రం తరచూ సమీక్షిస్తోంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తి కరమైన అంశంగా మారింది.

2024లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, అప్పటికీ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగింది. ఆ ఎన్నికల్లో ఓమర్ అబ్ధుల్లా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

రాష్ట్ర హోదా కల్పించడం, శాసనసభ ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు పలుమార్లు ప్రకటించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రజాస్వామ్య ప్రక్రియ తిరిగి పుంజుకోవడంతో పాటు ప్రజలకు ఊరటనిచ్చే అవకాశం ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాష్ట్ర హోదా కల్పనతో స్థానికులకు మెరుగైన అభివృద్ధి, పాలన లభిస్తుంది. మొత్తంగా, జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు మార్పుకు దారి తీసే ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Leave a Reply