IPL Ticket Rates : కొత్త జీఎస్టీతో పెరుగనున్న ఐపీఎల్ టికెట్ ధరలు

జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నాలుగు శ్లాబులను రెండుకు కుదించి, విలాసవంతమైన సేవలు, ఈవెంట్లను 40 శాతం పన్ను విభాగంలోకి చేర్చింది. దీని ప్రభావం ఐపీఎల్ టికెట్లపై పడనుంది.

ఇప్పటి వరకు ఐపీఎల్ టికెట్లపై 28 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తుండగా, ఇకపై 40 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. దీంతో క్రికెట్ అభిమానులకు టికెట్లు మరింత ఖరీదవుతాయి.

ఏవేవి 40% పన్ను కిందకు వచ్చాయి?

రేస్ క్లబ్బులు, లీజింగ్/రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌తో పాటు ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ లీగ్, ఇతర ప్రీమియం స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా ఈ జాబితాలోకి చేరాయి.

ఒక్కో టికెట్‌పై పెరిగే ధర

కొత్త జీఎస్టీ రూల్స్ ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉదాహరణకు, ఒక ఐపీఎల్ టికెట్ ధర రూ.1000 అయితే, 40 శాతం జీఎస్టీ కలిపి మొత్తం రూ.1400 చెల్లించాలి. అంటే గతంతో పోలిస్తే ఒక్కో టికెట్‌పై సుమారు రూ.120 అదనంగా భారమవుతుంది.

అయితే ఈ అదనపు పన్ను కేవలం ఐపీఎల్, ఇతర ప్రీమియం లీగ్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. సాధారణ క్షేత్రస్థాయి క్రీడా ఈవెంట్లకు ఇది వర్తించదు.

Leave a Reply