Weather Update: IMD హెచ్చరిక.. ఆగస్టు 10 వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో మరో వారంపాటు వర్షాభావం కొనసాగనుంది. ఇండియన్ మేట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం ఆగస్టు 10వ తేదీ వరకు ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో వచ్చే మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

రోజురోజుకూ వాతావరణం మారుతూ పలు ప్రాంతాల్లో నల్ల మేఘాలు, చిరుజల్లులతో పనులు అంతరాయానికి గురిచేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వరదలు ప్రళయంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలోని లోతట్టు ప్రాంతాలు తిరిగి వరద నీటిలో మునుగుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, వరద నీటికి వంతెనలు, రహదారులు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాతావరణశాఖ వివరాల ప్రకారం:

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు

తమిళనాడు, కేరళలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు

ఆగస్టు 5, 6 తేదీల్లో ఘాట్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు

ఈశాన్య & తూర్పు భారతదేశంలో వచ్చే 7 రోజులు వర్షపాతం బాగా అధికంగా ఉంటుందని IMD తెలిపింది

మరాఠ్వాడ (6–7 తేదీలు), కోంకణ్ & గోవా (7–8), మధ్య మహారాష్ట్ర (8న) కూడా తీవ్రమైన వర్షాల అవకాశం ఉందని పేర్కొంది

ఢిల్లీలో రాత్రి నుంచి తేలికపాటి వర్షం కురుస్తున్నప్పటికీ, గరిష్ట ఉష్ణోగ్రత 33.4°C, కనిష్ఠం 27.2°Cగా నమోదైనట్టు RWFC తెలిపింది. ఆగస్టు 10 వరకు మేఘావృతస్థితి కొనసాగుతూ తీవ్ర వర్షాలు సాధ్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

తెలంగాణలో వర్ష హెచ్చరికలు:
నిన్న హైదరాబాద్‌లో రెండున్నర గంటలపాటు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. రోడ్లు జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు IMD ప్రకారం ఈ నెల 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్, ములుగు, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Leave a Reply