మనము ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైతే సాధారణంగా విమానశ్రయ సిబ్బందిపై రుసరుసలాడుతాము. గమ్యస్థానానికి చేరుకోవడం ఆలస్యమవుతుందని, కొంత కోపంతో ఉంటాము. కానీ గోవా ఎయిర్‌పోర్టులో జరిగిన ఒక ఘటన వేరు. ఇక్కడ ఎక్కాల్సిన ఇండిగో (IndiGo) విమానం ఆలస్యం అయినా ప్రయాణీకులు ఏ మాత్రం విసుక్కోకుండా ఆనందంగా గర్బా నృత్యం చేశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన తరువాత అది వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం, గోవా నుంచి సూరత్‌కు వెళ్లాల్సిన విమానం కోసం పలువురు ప్రయాణీకులు గోవా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. పైలట్ అనారోగ్య కారణంగా విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణికుల్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. అయితే మయూర్ అనే వ్యక్తి, “గర్బా ఆడేందుకు సూరత్‌కి వెళ్లాల్సినది, కానీ విమానం ఆలస్యం కావడంతో ఇక్కడే చిక్కుకుపోయాను” అని సిబ్బందికి తెలిపారు. విమానం ఆలస్యం కావడంతో గర్బాలో పాల్గొనలేకపోవడంపై కొంత నిరుత్సాహానికి గురయ్యాడు.
सुरतियो ने गोवा एयरपोर्ट को बनाया गरबा ग्राउंड
इंडिगो की फ्लाइट में 7 घंटे की देरी होने पर सूरत एयरपोर्ट पर यात्रियों ने गरबा खेलकर जश्न मनाया pic.twitter.com/aBCT4x4zN5— Khushbu_journo (@Khushi75758998) September 30, 2025
ఇది తెలుసుకున్న ఇండిగో సిబ్బంది వెంటనే స్పందించారు. ఎయిర్‌పోర్టులో స్పీకర్లు ఏర్పాటు చేసి ప్రయాణీకులకు సంగీతం అందించారు. వెంటనే అందరూ ఆ సంగీతానికి తగినట్లు గర్బా ఆడారు. సిబ్బంది కూడా పాల్గొని ప్రయాణికులను ఉత్సాహపరిచారు. విమానం ఆలస్యం అయినప్పటికీ, అక్కడే ఉన్న ప్రయాణికులు సరదాగా సమయాన్ని గడిపారు. ఈ నృత్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. మయూర్ చివరగా, “విమానం ఆలస్యం అయినప్పటికీ, గర్బా నృత్యాన్ని ఆస్వాదించగలిగాను, ఇది మరచిపోలేని రోజు” అని ఆనందం వ్యక్తం చేశాడు.