చంగూర్ బాబా మతమార్పిడి కేసు.. రోజు రోజుకూ వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు

ఇటీవల దేశవ్యాప్తంగా చంగూర్ బాబా మతమార్పిడి కేసుపై తీవ్ర చర్చ సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా ఉత్రౌలా ప్రాంతానికి చెందిన జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా అక్రమ మతమార్పిడి నెట్‌వర్క్‌కి కేంద్రబిందువుగా మారాడు.

జులై 5న, ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) లక్నోలోని వికాస్‌నగర్‌లోని స్టార్ రూమ్స్ హోటల్‌లో చంగూర్ బాబాను మరియు అతని సహచరురాలు నీతూ రోహ్రా (అలియాస్ నస్రీన్) ను అరెస్టు చేసింది.

దర్యాప్తులో, ఈ ఇద్దరు విదేశీ ఫండింగ్‌ (సుమారు రూ. 100 కోట్లు) ఆధారంగా గ్రామీణ, పేద వర్గాలపై లక్ష్యంగా పెట్టుకుని అక్రమ మతమార్పిడి ముఠా నడిపినట్లు వెల్లడైంది. డబ్బు, ఉద్యోగాలు, వైద్యం వంటి ఆశలు చూపిస్తూ, లవ్ ట్రాప్‌లు, బెదిరింపులు వంటి పద్ధతులతో హిందూ యువతను ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నాలు చేశారు.

విశేషం ఏంటంటే, మతమార్పిడికి జాతి ప్రాతిపదికన రేట్లు కూడా నిర్ణయించారని అధికారులు తెలిపారు:

బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు యువతులకు: రూ. 15-16 లక్షలు

బీసీలకు: రూ. 10-12 లక్షలు

ఇతరులకు: రూ. 8-10 లక్షలు

ఇదంతా ప్రారంభంలో ఒక సాధారణ తాయిత్తుల అమ్మకందారిగా జీవించేవాడైన చంగూర్ బాబా, మతమార్పిడి ముఠాలో ప్రవేశించి కొన్ని సంవత్సరాల్లోనే రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడగట్టాడని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. చంగూర్ బాబా అక్రమ ఆస్తులు, దర్గాలపై దాడులు జరిపి వాటిని నేలమట్టం చేసింది. అలాగే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి నివేదికను సమర్పించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply