Black box: అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? విమాన ప్రమాదాల్లో ఇది ఎందుకు కీలకం?

విమాన ప్రమాదాలు జరిగిన ప్రతీసారి మనకు తరచూ వినిపించే పదం బ్లాక్ బాక్స్. ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎటువంటి లోపాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలన్నింటికీ బ్లాక్ బాక్స్ ద్వారా స్పష్టత వచ్చేస్తుంది.

విమానంలో అగ్నిప్రమాదం జరిగినా, కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలు, సాంకేతిక లోపాలు, అత్యవసర చర్యలపై తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఈ బ్లాక్ బాక్స్‌ ద్వారా రికార్డవుతాయి. అందుకే ఇది ప్రతి విమానానికి కీలకం.

ఈ బ్లాక్ బాక్స్‌లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి:

Cockpit Voice Recorder (CVR) – పైలట్ సంభాషణలు, అలారాలు, శబ్దాలు

Flight Data Recorder (FDR) – ఎత్తు, వేగం, ఇంజిన్ పనితీరు, నియంత్రణ మార్గదర్శకాలు

ఈ పరికరాలు అత్యధిక ఉష్ణోగ్రతలు, మంటలు, షాక్‌లను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడతాయి. అందువల్ల, ప్రమాదం జరిగినా వీటిని రికవర్ చేసి, విశ్లేషించడం సాధ్యమవుతుంది.

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సందర్భంలో కూడా బ్లాక్ బాక్స్‌ కీలక ఆధారంగా మారింది. అధికారులే స్వయంగా శకలాల మధ్య నుంచి బ్లాక్ బాక్స్‌ను వెలికితీశారు. ఇప్పుడు నిపుణులు ఆడియో రికార్డులను విశ్లేషించి ప్రమాదానికి గల కారణాలను గుర్తించనున్నారు.

CVR ద్వారా పైలట్ల సంభాషణలు, ట్రాన్స్‌మిషన్‌లు, అలారాలు, శబ్దాలు ట్రాన్స్‌ చేస్తారు. FDR డేటాతో విమానం ఎక్కడ ఎలా నడిచింది అనే వివరాలు తెలుస్తాయి. ఈ రెండు భాగాల విశ్లేషణ ద్వారా ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై స్పష్టత వస్తుంది.

ఫ్యూచర్‌లో ఇలాంటివి జరగకుండా చూసేందుకు, విమాన భద్రత ప్రమాణాలను మరింతగా కఠినంగా అమలు చేయడానికి, బ్లాక్ బాక్స్ సమాచారం కీలకంగా ఉపయోగపడుతుంది.

Leave a Reply