కొంత ఉత్కంఠ రేపినా.. చివరికి పరువు నిలబెట్టింది టీమ్ ఇండియా. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు గెలుపు అందించారు.
ఫైనల్‌లో తిలక్ వర్మ ప్రత్యేకంగా మెరిశాడు. వరుసగా వికెట్లు పడిపోతున్న సమయంలో పిలర్‌లా నిలబడి జట్టుకు స్థిరత్వం ఇచ్చాడు. ఒత్తిడిని తట్టుకొని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, టీమ్ ఇండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. చివరికి భారత్ ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. తిలక్ వర్మ 69 నాటౌట్ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే 33 పరుగులు (22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశారు.
India winning
moment asia cup final … 🧡
This isn’t just a game, it’s a war …🔥#congratulations #INDvPAK #IndianCricket 🫰🫰 pic.twitter.com/YY3gqTnTi8
— !! 𝕊𝕙𝕚𝕧𝕙𝕠𝕝𝕚𝕔 !! (@Kuldeep84162406) September 28, 2025
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ ఫైనల్‌కు భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్-పాకిస్తాన్ ఫైనల్‌లో తలపడటంతో క్రేజ్ మరింత పెరిగింది. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ శుభారంభం ఇచ్చారు. వేగంగా పరుగులు చేస్తూ పెద్ద టార్గెట్ పెడతారని అనిపించింది.
అయితే పదో ఓవర్ నుంచి భారత బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా వికెట్లు తీసి పాకిస్తాన్‌ను ఒత్తిడికి గురిచేశారు. ఫర్హాన్ ఒక్కరే 57 పరుగులు చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో పాక్ స్కోరు 147 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో కుల్‌దీప్ (4/30), అక్షర్ పటేల్ (2/26), వరుణ్ చక్రవర్తి (2/30) అద్భుత బౌలింగ్ చేసి పాకిస్తాన్‌ను 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ చేశారు.