బీజేపీ నేతలు వరుసగా చరిత్ర సృష్టిస్తున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇందిరా గాంధీ తర్వాత దేశాన్ని అత్యంత ఎక్కువ కాలం నేతృత్వం వహించిన ప్రధానిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పనిచేసిన నేతగా అమిత్ షా నిలిచారు. ఇప్పటి వరకు ఈ రికార్డు బీజేపీ మాజీ నాయకుడు ఎల్కే అద్వానీ పేరిట ఉండగా.. ప్రస్తుతం అమిత్ షా ఆ శిఖరాన్ని అధిగమించారు. అద్వానీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్ వంటి నాయకులు సుమారు ఆరు సంవత్సరాలు హోంమంత్రులుగా పనిచేశారు. మోదీ 1.0 హయంలో హోంమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ 5 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు.
అయితే అమిత్ షా ఇప్పటికే 6 సంవత్సరాలు 64 రోజులు హోంమంత్రిగా కొనసాగుతూ.. భారత రాజకీయాల్లో అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. ఇంకా పదవిలో కొనసాగుతూనే ఉన్నారు.
అమిత్ షా ప్రధానమైన కీలక నిర్ణయాలు:
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పై నిర్ణయం
దేశంలో నక్సలిజం నివారణకు కఠిన చర్యలు
హోంమంత్రి అయ్యే ముందు అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అస్సాం, త్రిపుర, అలాగే 15 ఏళ్ల తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ వ్యూహాత్మక నైపుణ్యానికి నిదర్శనం.