ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శుభవార్త తెలిపింది. ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక గ్రాండ్ సేల్ “గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025” తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ ఆఫర్లు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి.
అయితే ఈ సేల్ ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని అమెజాన్ వెల్లడించలేదు. ప్రైమ్ యూజర్లకు మాత్రం 24 గంటల ముందుగానే ప్రత్యేక ఆఫర్లకు యాక్సెస్ లభిస్తుంది. ఇప్పటికే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు రాబోతున్నాయని అమెజాన్ టీజర్ విడుదల చేసింది.
🚨 Amazon Great Indian Festival 2025 – Sale Dates Announced – 23rd Sep 2025!!
Sale Announcement Link – https://t.co/6eHHx5m0Et
Biggest Sale of the Year !! Extra 10% discount via SBI Card
Apply for SBI Card now & Get before sale – https://t.co/Xc49AbZIkC
📅 Start Date: 23rd… pic.twitter.com/DacCiLXstV
— DesiDime (@desi_dime) September 4, 2025
ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, యాక్సెసరీస్ సహా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీ డిస్కౌంట్లతో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా శాంసంగ్, రియల్‌మీ, డెల్, యాపిల్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులపై 40% వరకు డిస్కౌంట్ ఉండనున్నట్టు అమెజాన్ తెలిపింది.
అలాగే SBI క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, వడ్డీరహిత ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్చేంజ్ బోనస్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. HP, బోట్, సోనీ వంటి బ్రాండ్లపై యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80% వరకు ఆఫర్లు ప్రకటించింది.
ప్రతీ సంవత్సరం దసరా-దీపావళి సీజన్‌లో జరిగే ఈ సేల్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈసారి కూడా ఆకట్టుకునే ఆఫర్లతో అమెజాన్ మరింత మంది వినియోగదారులను ఆకర్షించనుంది.