భారత వైమానిక దళం (Indian Air Force) యువతకు భారీ అవకాశాన్ని కల్పిస్తోంది. అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. దేశసేవ చేయాలనే ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జూలై 11 నుంచి ప్రారంభమై, జూలై 31, 2025లో ముగియనున్నాయి. సెప్టెంబర్ 25న రాత పరీక్ష జరగనుంది.
అర్హతలు & వయస్సు పరిమితి
వయస్సు: కనీసం 17.5 సంవత్సరాలు ఉండాలి, గరిష్ఠంగా 21 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు జూలై 2, 2005 – జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి.
విద్యార్హతలు:
10+2 (ఇంటర్) లో గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత, లేదా డిప్లొమా ఇంజినీరింగ్ (మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ తదితర శాఖల్లో), లేదా 3 సంవత్సరాల ఐటీఐ డిప్లొమా, లేదా వొకేషనల్ కోర్సు (ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండే 2 సంవత్సరాల కోర్సు).
దరఖాస్తు ఫీజు:
అన్ని కేటగిరీల అభ్యర్థులకు: ₹550
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ రాత పరీక్ష
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)
అడాప్టబిలిటీ టెస్ట్ I – మానసిక సామర్థ్యం
అడాప్టబిలిటీ టెస్ట్ II – సమూహ చర్చలు
మెడికల్ పరీక్ష
ఈ మొత్తం ప్రక్రియలో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
జీతం వివరాలు (Year-wise Pay):
ఏడాది నెల జీతం (రూ.)
1వ సంవత్సరం ₹30,000
2వ సంవత్సరం ₹33,000
3వ సంవత్సరం ₹36,500
4వ సంవత్సరం ₹40,000
ఈ అగ్నిపథ్ పథకం కింద యువతకు వీటితో పాటు శిక్షణ, వృత్తి అభివృద్ధి, భవిష్యత్ కారియర్ అవకాశాలు కల్పించబడతాయి. ఈ అవకాశాన్ని వదులుకోకుండా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని భారత వైమానిక దళం సూచిస్తోంది.