20 ఏళ్ల నిరుద్యోగి ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు! బ్యాంక్‌లో రూ.11.13 లక్షల కోట్ల ట్విస్ట్..

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, డాంకౌర్ గ్రామంలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటుచేసుకుంది. దీపక్ అనే 20ఏళ్ల యువకుడి బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా రూ.11.13 లక్షల కోట్లు జమ కావడంతో ఒక్కసారిగా అందరూ ఆయనవైపు చూసేలా చేసింది. చిన్న గ్రామానికి చెందిన నిరుద్యోగి అయిన దీపక్ రెండు నెలల క్రితమే కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఖాతా తెరిచాడు.

ఒక రోజు ఉదయం అతని ఫోన్‌కు భారీ మొత్తంలో డిపాజిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ మొత్తం చూసిన దీపక్ షాక్‌కు గురయ్యి వెంటనే బ్యాంకుకు పరుగులు పెట్టాడు. ముందుగా అతని తల్లి గాయత్రీ దేవి ఖాతాలో రూ.1,13,56,000 కోట్లకు పైగా జమ అయినట్లు మెసేజ్ రావడంతో అలర్ట్ అయ్యాడు.

విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు వెంటనే ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఇన్‌కమ్‌టాక్స్ శాఖ సహా విచారణ సంస్థలు ఈ డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టాయి. ఇది టెక్నికల్ లోపమా? లేక మిగతావేరే అక్రమ లావాదేవీయా? అనే కోణాల్లో కేసును పరిశీలిస్తున్నారు.

ఇంత మొత్తంలో డబ్బు పొరపాటున ట్రాన్స్ఫర్ కావడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఈ విచిత్ర సంఘటన ప్రస్తుతం డాంకౌర్ గ్రామంలోనే కాకుండా, గ్రేటర్ నోయిడా చుట్టుపక్కల మొత్తం ప్రాంతమంతా సంచలనంగా మారింది.

Leave a Reply